అల్లు ఫ్యామిలీతో రాజ‌మౌళి విభేదాలు.. అస‌లెక్క‌డ చెడిందో తెలుసా?

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` తో ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రాజ‌మౌళి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ కూడా ఇటువైపే చూసే విధంగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఆరాటపడుతున్నారు.

కానీ రాజమౌళి కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. నేటితరం హీరోల్లో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ తో రాజమౌళి సినిమాలు చేశాడు. అలాగే మహేష్ బాబు తో కూడా ఓ మూవీని ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మాత్రం జక్కన్న సినిమా తీయలేదు. అందుకు కారణం అల్లు ఫ్యామిలీతో రాజమౌళికి ఉన్న విభేదాలే అని ఇన్సైడ్ టాక్‌ ఉంది.

Allu-Aravind
Allu-Aravind

అల్లు ఫ్యామిలీతో రాజమౌళికి అసలు ఎక్కడ చెడిందంటే.. ఈయన దర్శకత్వంలో వచ్చిన `మగధీర` సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా వసూళ్ల లెక్కలు బయటకు చెప్పొద్దని, అలాగే మగధీరను తమిళ మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని రాజ‌మౌళి కోరాడట. కానీ అల్లు అరవింద్ అందుకు ఒప్పుకోలేదు. పైగా లెక్కలు మొత్తం బయటకు చెప్పేశార‌ట‌. ఈ విషయంలోనే అల్లు అరవింద్ తో రాజమౌళికి గొడవలు వచ్చాయ‌ని.. ఇక అప్పటినుంచి అల్లు ఫ్యామిలీని రాజమౌళి దూరం పెట్టాడ‌ని టాక్ ఉంది.

Share post:

Latest