బాబు-పవన్ కలిసే..జగన్‌కే ప్లస్ అంటా?

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఆ మధ్య విశాఖలో పవన్‌ కల్యాణ్‌ని జనవాణి కార్యక్రమం చేయనివ్వకుండా పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టి..పవన్‌ని విశాఖ నుంచి పంపించినప్పుడు..చంద్రబాబు..పవన్‌ని కలిసి సంఘీభావం తెలిపారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం జీవో 1 తెచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టకూడదని, కుప్పంలో అడుగడున బాబుకు ఆంక్షలు పెట్టారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ జరిగింది. అలాగే కార్యకర్తలపై పలు కేసు పెట్టారు. బాబుని స్వేచ్ఛగా తిరగనివ్వలేదు.

ఈ క్రమంలోనే పవన్..తాజాగా హైదరాబాద్‌లోని బాబు ఇంటికొచ్చి కలిశారు. తాజా ఘటనలపై బాబుకు సంఘీభావం తెలిపారు. అలాగే జీవో 1ని వెనక్కి తీసుకునేలా ఉమ్మడి పోరుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సందర్భంగా పొత్తుల గురించి ఎలాంటి చర్చలు జరగలేదని, కేవలం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవోపై ఉమ్మడిగా ఫైట్ చేస్తామని బాబు-పవన్ చెప్పారు.  ఇక వీరు కలవడంతో యథావిధిగా వైసీపీ మంత్రులు వచ్చి..విమర్శల వర్షం కురిపించారు.

ఎవరు కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని కామెంట్ చేశారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో బాబు-పవన్ పొత్తులో వస్తే..జగన్‌కే అడ్వాంటేజ్ అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. అంటే టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల వైసీపీకే బెనిఫిట్ అని ఆయన చెబుతున్నారు.

ఇక మంత్రి చెప్పినట్లే పరిస్తితి ఉంటుందా? అవునని చెప్పలేం. ఎందుకంటే టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఓట్లు చీలిక ఉండదు కాబట్టి..వైసీపీకే నష్టం జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.