అనిల్ స్కెచ్ అదిరిపోయిందిగా.. బాల‌య్య జోరు మాములుగా లెదుగా..!

నంద‌మూరి బాకృష్ణ వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్‌లోనే సూప‌ర్ ఫామ్‌లో దూసుకుపోతున్న‌డు. అఖండ‌తో మొద‌లైన దండ‌యాత్ర సంక్రాంతికి వ‌చ్చిన వీరసింహ‌రెడ్డితో మ‌రో లెవ‌ల్‌కు తీసుకు వెళ్ళాడు. ఈ సినిమా ఇప్ప‌టికే రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టుకొని బాల‌య్య కేరీర్‌లోనే అల్ టైమ్ సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో బాల‌య్య‌ను మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూడాని కోత్త లుక్‌లో చూడబోతున్నాం అన్ని తాజాగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి నిన్న వీరసింహ‌రెడ్డి విజయోత్సవ సభలో అయ‌న చెప్పుకోచ్చ‌డు. ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య‌ను మ‌నం రాయ‌ల‌సీయ ప్యాక్ష‌న్ లుక్‌లోనే చూశం. ఇసారి మ‌త్రం బాలయ్యను తెలంగాణ మాండలికంలో డైలాగ్ లు చెబితే ఎలా ఉంటుందో చూడాలి అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందట.

అయితె, బాలయ్య పాత్ర కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉన్నా.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ఆలోచనలు, యాక్టివిటీస్ వెరీ ఫన్నీగా సాగుతాయట. అలాగే సినిమాలో తండ్రి – కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ప్లాష్ బ్యాక్ కూడా చాలా మాస్‌ గా ఉంటుందట. మొత్తానికి అనిల్ – బాలయ్య కలయికలో సినిమా వ‌స్తుంది అనగానే ఆ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అనిల్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.