ఏ ఇండస్ట్రీలోనైనా టాప్ హీరో ఎవరు అనే విషయంపై ఎప్పుడూ కూడా ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. ఏ హీరో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారనే విషయాన్ని కూడా ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు. అందుచేతనే పలు మీడియా సంస్థలు మాత్రం ఇలాంటి ఇబ్బందులను గమనించి.. ప్రతినెల ప్రతి, సంవత్సరం ఒక లిస్టును విడుదల చేస్తూ ఉంటుంది. అలా విడుదల చేసేటువంటి మీడియా సంస్థలలో ఆర్మాక్స్ మీడియా సంస్థ కూడా ఒకటి. తాజాగా గత సంవత్సరం మోస్ట్ పాపులర్ మెయిల్ హీరోల జాబితాలను విడుదల చేసింది. వాటి గురించి చూద్దాం.
ఈ లిస్టులో ఎప్పటిలాగానే ప్రభాస్ అగ్రస్థానాన్ని అందుకున్నారు. ఇక రెండవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలబడగా.. మూడవ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. నాలుగో స్థానంలో రామ్ చరణ్, ఐదవ స్థానంలో మహేష్ బాబు.. ఆరో స్థానంలో పవన్ కళ్యాణ్ ఏడవ స్థానంలో హీరో నాని నిలిచారు. ఇదే నీతో స్థానంలో విజయ్ దేవరకొండ ఉండగా తొమ్మిదవ స్థానంలో చిరంజీవి నిలుచున్నారు. పదవ స్థానంలో రవితేజ నిలిచారు. అయితే వీరందరూ కేవలం టాప్ టెన్ హీరోలు.
మిగిలిన హీరోలు కూడా చాలామంది.. నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ జాబితాను సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరిపిన తర్వాతే ఈ హీరోల జాబితాను ఆర్మాక్స్ విడుదల చేసినట్లుగా తెలియజేస్తోంది. మొత్తం మీద తెలుగులో అయితే ప్రభాస్, ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, మహేష్ ,రామ్ చరణ్ వంటి వారు టాప్ ఫైవ్ ప్లేస్ లో స్థానాన్ని దక్కించుకున్నారు. మిగిలిన వారు తమ స్థాయికి తగ్గట్టుగానే పలు సినిమాలలో నటిస్తూ అభిమానులను అలరిస్తూ ఉన్నారు. ఇది కేవలం గత ఏడాది సంబంధించిన మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్ జాబితా.
Top 10 most popular male Telugu film stars of 2022#Ormax2022 #OrmaxStarsIndiaLoves #OrmaxSIL pic.twitter.com/hr7rdFcxmj
— Ormax Media (@OrmaxMedia) January 21, 2023