కళాతపస్వి స్వాతిముత్యం తర్వాత.. అలాంటి అరుదైన ఘనత రాజమౌళి ఇదే..!

మన భారతీయ చిత్రపరిశ్రమలో ఇప్పటికి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప నటులు ఇప్పటికి ప్రేక్షకులను తమ నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఎందరో నటులు వస్తున్నారు పోతున్నారు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాయి. మన భారతీయ చిత్ర పరిశ్రమంలో 1957 నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డులకు 54 చిత్రాలు అధికారికంగా నామినేట్ అయ్యాయి.

K Viswanath - Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కళా తపస్వి విశ్వనాథ్  కన్నీళ్లు పెట్టించిన వేళ.. | K Viswanath Megastar Chiranjeevi cries after  watching k viswanath kamal haasan swathi muthyam ...

ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎందరో నటులు దర్శకులు ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించారు. తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా రాధిక హీరోయిన్‌గా వచ్చిన ఆల్ టైం సూపర్ హిట్ సినిమా ‘స్వాతిముత్యం’. ఈ సినిమా ఆరోజుల్లో ఆస్కార్ అవార్డులో షార్ట్ లిస్ట్ అయినా ఏకైక తెలుగు చిత్రం కూడా ఇదే. ఆ తర్వాత బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లాగాన్ ఆస్కార్ అవార్డుల నామినేషన్ లో నిలిచింది.

RRR: SS Rajamouli Reveals How He Named The Movie & You Definitely ...

ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఏ సినిమా కూడా ఆస్కార్ అవార్డులకు తుది పోరు వరకు వెళ్లలేదు. ఇక స్వాతిముత్యం సినిమా తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుల్లో నామినేట్ అవ్వడం మన భారతీయులకు గర్వకారణం. తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వికే. విశ్వనాథ్ తర్వాత ఎన్ని సంవత్సరాలకి మళ్లీ ఈ ఘనత రాజమౌళికే దక్కింది. ఇక దీంతో మరోసారి తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చూపించింది త్రిబుల్ ఆర్ సినిమా.

Share post:

Latest