శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అతనికంటే ఎవరు తనని అలా చూడలేరట..!

లోకనాయకుడు కమలహాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. శృతిహాసన్ టాలీవుడ్, కోలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని భాషలోనూ సినిమాల్లో నటించింది. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే శృతిహాసన్ ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో సినిమాలుకు దూరమై తన కెరీర్‌ను నిర్లక్ష్యం చేసింది.

Shruti Haasan: నీకంటే ఎక్కువగా నన్ను సంతోషంగా చూసుకోలేరు.. అతడి కలిసి ఉన్న  ఫోటో షేర్ చేసిన శ్రుతి హాసన్.. | Actress Shruti Haasan Shares Special Note  With Santanu Hazarika Photo ...

మళ్లీ రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఈ సంక్రాంతికి చిరు, బాలయ్యలతో నటించి అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వీటితోపాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అంతా భావిస్తున్నారు.

బాలయ్య-చిరు వయసుపై అలాంటి కామెంట్స్ చేసిన శృతి | Shruti To Give Calrity On  Age Related Comments, Shruti Haasan, Salaar, Nandamuri Balakrishna,  Chiranjeevi, Waltair Veerayya, Veera Simha Reddy - Telugu Salaar ...

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే శృతిహాసన్ మళ్లీ టాప్ ప్లేస్ లో నిలవడం ఖాయం అని అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే శృతిహాసన్ మళ్ళీ శాంతాను హజారికానే వ్య‌క్తితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతనితో డేటింగ్ చేస్తుంది శృతి. తనుకు టైం దొరికిన ప్రతిసారి తన లవర్ తో కలిసి వెకేషన్ కి వెళుతూ రెస్టారెంట్లు చుట్టూ తిరుగుతూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే పెళ్లి ఎప్పుడు అని ఈ జంటను ప్రశ్నిస్తే మాత్రం దానికి ఆన్సర్ మాత్రం ఇవ్వటం లేదు.

తాజాగా ఈ అమ్మడు  తన ప్రియుడు శాంతను హజారికాతో ఫోటోను తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన ప్రేమను తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది.

తన తండ్రి మార్గంలోనే డేటింగ్ చేయడానికి శృతిహాసన్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు తాజాగా తన ప్రియుడుతో కలిసి దిగిన ఫోటోను శృతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు శృతిహాసన్ చేసిన‌ ఎమోషనల్ కామెంట్‌ చూసి అందరూ ఒకేసారిగా షాక్ అయ్యారు..’ ఈ ప్రపంచంలో నీకంటే కూడా.. నన్ను ఎవరు సంతోషంగా చూసుకునేవారు ఎవరూ లేరు.. అంటూ ఓ ఎమోషనల్ కామెంట్ ను దానికి జత చేసింది’. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest