మదనపల్లెలో టీడీపీకి ఛాన్స్ ఇవ్వని వైసీపీ..!

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి ఆధిక్యం వచ్చేలా కనిపించడం లేదు. ఇంకా నాయకులు సరిగ్గా కష్టపడకపోవడం…వైసీపీ ఎత్తులతో టీడీపీ వెనుకబడిపోతుంది. గత ఎన్నికల్లోనే జిల్లాలో 14 సీట్లకు వైసీపీ 13 గెలిచేసుకుంది..కేవలం కుప్పం సీటు టీడీపీ గెలిచింది. అయితే ఈ సారి కుప్పం సీటుని కూడా గెలుచుకుంటామని వైసీపీ చెబుతోంది. వైసీపీ చెప్పినట్లుగా అదే జరిగే పని కాదు. ఈ సారి వైసీపీకి సీన్ రివర్స్ అయ్యే చాన్స్ ఉంది.

అలా అని వైసీపీ ఆధిక్యం కొనసాగే చాన్స్ ఉంది. ఎందుకంటే జిల్లాలో టీడీపీకి పట్టు దొరకడం లేదు. కేవలం కుప్పం, పీలేరు, నగరి, పలమనేరు, తిరుపతి లాంటి సీట్లలోనే టీడీపీకి బలం కనిపిస్తోంది. మిగిలిన సీట్లలో వైసీపీ ఆధిక్యం ఉంది. వాస్తవానికి మదనపల్లెలో టీడీపీకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు పూర్తిగా ప్లస్ లేదు. ఇక్కడ ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది.

అలాగే గత మూడు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. దీంతో టీడీపీపై కాస్త సానుభూతి ఉంది..టీడీపీ శ్రేణులు కసిగా ఉన్నారు. కానీ ఇంచార్జ్ గా ఉన్న దొమ్మాలపాటి రమేష్ అనుకున్న స్థాయిలో పనిచేయడంలో విఫలమవుతున్నారు. ఆ మధ్య జరిగిన మినీ మహానాడు కార్యక్రమం భారీగా సక్సెస్ అయింది. ఆ సక్సెస్‌ని రమేష్ సరిగ్గా వాడుకోలేదు. పైగా ఇక్కడ గ్రూపు తగాదాలు టీడీపీకి మైనస్. దీంతో మదనపల్లెలో వైసీపీ లీడ్ లోనే ఉంది.

తాజాగా జగన్ సభ ఇక్కడ జరిగింది..అదే సమయంలో టీడీపీ నేత నరేష్ కుమార్ రెడ్డి..తాజాగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. అంటే ఇక్కడ టీడీపీ సరిగ్గా లేదని అర్ధమవుతుంది. ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా మదనపల్లెలో టీడీపీ గెలవడం సాధ్యమయ్యే పని కాదు.