టాలీవుడ్ ఇండస్ట్రీలో తండ్రి ఎన్టీఆర్ కలిసి ఎన్నో చిత్రాలలో నటించి.. చిన్నతనంలోనే పేరును సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన గురించి చెప్పాలంటే చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అప్పట్లో కానీ ఇప్పట్లో కాని బాలయ్య సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు. అంతేకాకుండా ఆయనతో సినిమా తీసే ఆడవాళ్లకు ఎంతో మర్యాద గౌరవాన్ని ఇచ్చేవారట. ఇక ఈమధ్య వచ్చిన అఖండ సినిమా ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకుడిగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ మూవీ టైటిల్ ను కర్నూల్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమా పేరు తగ్గట్టు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవల బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. దాంతో ఇప్పుడు తీసే వీర సింహారెడ్డి సినిమా కూడా అలా భారీ అంచనాలతో దుమ్ము రేపుతుందని అభిమానులు అనుకుంటున్నారు.
ఇక వీరసింహారెడ్డి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ యాక్టన్ ఎంటర్టైనర్ గా తెరకొక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది.అలాగే లాల్ ‘దునియా’ విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఇక దునియా విజయ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యి షూటింగ్ నుంచి వెళ్ళిపోతూ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.అయితే దునియా విజయ్ కన్నడ నట దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు కేవలం బాలకృష్ణ కోసం ఆయన సినిమాల్లో విలన్ గా నటించటానికి ఒప్పుకున్నారట. ఈయన మీడియా తో మాట్లాడుతూ బాలయ్య గారు నాకు దేవుడిచ్చిన అన్నయ్య అని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారట. ఇక షూటింగ్ టైంలో బాలకృష్ణతో పంచుకున్న అనుభవాల గురించి మాటల్లో చెప్పలేనని విజయ్ అన్నారు. బాలయ్య సింహం లాంటి మనిషి అని ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. సినిమా విషయానికి వస్తే ఈ సినిమా పెద్ద సక్సెస్ ని అందుకుంటుందని విజయ్ ఆయన మాటల్లో అన్నారు.