ఇండియన్ ఆర్మీ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం మేజర్..ఈ సినిమా తర్వాత అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 2. హిట్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. హిట్ వన్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు హిట్ 2 లో అడవి శేష్ నటించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలయింది. అయితే విడుదలైన మొదటి రోజే మొదటి షో తో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఇకపోతే యంగ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ఈయన కెరియర్ మొదట్లో కాస్త అటు ఇటుగా ఉన్నా.. తనను తాను మార్చుకొని ప్రస్తుతం తన సినిమాలకు తానే కథలు రాసుకుంటూ వరుసగా హిట్టులను అందుకుంటున్నారు. ఇకపోతే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
కథ విషయానికి వస్తే.. హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్ ను ఛేదించాడు అనేది థ్రిల్లింగ్గా చూపిస్తున్నారు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా 995 స్క్రీన్స్ లో ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి , మరో కొత్త హీరోయిన్ కోమలి ప్రసాద్ కూడా నటించారు. ఇకపోతే ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది . హిట్ 1 కూడా ప్రైమ్ వీడియోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే..ఇప్పుడు హిట్ 2 సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.