టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కొత్త బంగారులోకం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలా వరుస ఆఫర్లు శ్వేతా బసు కు వెల్లుబడ్డాయి కానీ అన్ని ప్లాపులు కావడంతో.. ఎంత పాపులారిటీ అయితే తక్కువ సమయంలో సంపాదించిందో అంతే త్వరగా ఫెడ్ అవుట్ అయిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీ బెంగాలీ సినిమాలలో నటించిన శ్వేత చైల్డ్ యాక్టర్ బాగానే పేరు సంపాదించింది.
ముఖ్యంగా అబ్దుల్ కలాం చేతుల మీదుగా బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా కూడా నేషనల్ అవార్డును అందుకున్నది. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో శ్వేతా బసు ప్రసాద్ పైన జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురయ్యాలా చేసింది. ఆ సంఘటన శ్వేతా బసు ప్రసాద్ జీవితంలో ఊహించని మచ్చగా మిగిలిపోయింది.ఆ తర్వాత టాలీవుడ్ కు దూరమై బాలీవుడ్లో పలు సినిమాలలో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండేది ఆ సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది 2018లో డిసెంబర్లో ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకొని ఆ ఏడాది విడిపోయింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఎంతో ప్రయత్నించిన ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించింది. దీంతో పలు ఫోటోలను సైతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉంటోంది. ఇక చివరిగా లాక్ డౌన్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. మరి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలనే కల నెరవేరుతుందో లేదో చూడాలి మరి.