కోట్లపై కన్ను..వైసీపీకి ఛాన్స్ ఇస్తారా?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలమైన నాయకుల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఒకరు. తన తండ్రి, మాజీ సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి..కోట్ల ఫ్యామిలీకి జిల్లాలో మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అద్భుతమైన విజయాలు అందుకున్నారు. కానీ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. దీంతో కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి కోట్ల..2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. వాస్తవానికి అప్పుడే వైసీపీ సైతం కోట్ల ఫ్యామిలీ కోసం ట్రై చేసింది.

కానీ కోట్ల ఫ్యామిలీ అనూహ్యంగా టీడీపీలో చేరింది. అలాగే కర్నూలు ఎంపీ సీటులో కోట్ల, ఆలూరులో సుజాతమ్మ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు కోట్ల ఫ్యామిలీ పెద్దగా యాక్టివ్ గా లేదు. కానీ నిదానంగా ఆ ఫ్యామిలీ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయింది..టీడీపీలో దూకుడుగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు కర్నూలులో వైసీపీకి నెగిటివ్ పెరుగుతుంది. గత ఎన్నికల్లో 14కి 14 సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు ఆ పరిస్తితి లేదు.

దాదాపు 5-6 సీట్లు వైసీపీ కోల్పోతుందని ప్రచారం జరుగుతుంది..పైగా ఇటీవల కర్నూలు పర్యటనకు వచ్చిన బాబుకు జనం నుంచి భారీ  స్పందన వచ్చింది. ఆ స్పందన టీడీపీ వాళ్ళు కూడా ఊహించలేదు. ఇక అక్కడ నుంచి కర్నూలులో టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీని దెబ్బతీయడానికి కోట్ల ఫ్యామిలీని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. ఇప్పటికే ఆయనతో కొందరు వైసీపీ పెద్దలు సంప్రదింపులు జరిపారని సమాచారం. కానీ వైసీపీ ఆఫర్లని కోట్ల తిరస్కరించినట్లు తెలిసింది.

అయినా సరే కోట్ల ఫ్యామిలీ కోసం వైసీపీ ట్రై చేస్తున్నట్లే తెలిసింది..కానీ ఆయన మాత్రం టీడీపీలో ఇంకా దూకుడుగా పనిచేస్తున్నారు. వైసీపీలోని కింది స్థాయి కార్యకర్తలని టీడీపీలోకి తీసుకొస్తున్నారు. తాజాగా కూడా ఓ ఎంపీటీసీ..వెయ్యి మందిపైనే కార్యకర్తలు టీడీపీలో చేరారు. కాబట్టి కోట్లని లాగడం వైసీపీకి ఈజీ కాదని చెప్పవచ్చు.