పబ్లిక్ గా జూనియర్ ఎన్టీఆర్ గురించి హరికృష్ణ ఏమన్నారు అంటే..?

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. ఎన్టీఆర్ ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో పైకి ఎదిగారని చెప్పవచ్చు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ సపోర్టు ఎన్టీఆర్ కు లేదని అప్పట్లో వార్తలు వినిపించాయి. తండ్రి హరికృష్ణ ఈ వార్తలపై ఒక సినిమా ఫంక్షన్లు వేదికగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ అరుదైన సంఘటన గురించి పలు విషయాలను తెలుసుకుందాం.

NTR & Harikrishna Fun Moments @ ISM Movie Audio Launch | TFPC - YouTube

ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణతో కలిసి హీరో అయిన తర్వాత స్వేచ్ఛగా అభిమానులకు కనిపించింది మాత్రం శివరామరాజు ఆడియో ఫంక్షన్ లో మాత్రమే అన్నట్లుగా తెలుస్తోంది. శ్రీరాములయ్య, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో వరుస విజయాలను అందుకున్నారు హరికృష్ణ. శివరామరాజు చిత్రంలో ఆనంద భూపతిగా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఈ ఆడియో వేదికపై తన పర్సనల్ విషయాల గురించి డైరెక్టర్ నిర్మాతలను పరిమిషన్ అడిగి మరి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.Jr NTR - Harikrishna: నాన్న వల్లే అది చూడటం ఆపేసా.. తండ్రి హరికృష్ణను  గుర్తు చేసుకున్న ఎన్టీఆర్.. | Tollywood star hero Jr NTR remembers his  father Late Harikrishna and shared a memorable ...

ఎన్టీఆర్ ని మేము ఎవరమూ పట్టించుకోవడంలేదని ఏకాకిని చేశామనే వార్తలు వినిపించాయి అదంతా అబద్ధం.. ఎవరికివారు స్వశక్తితో ఎదగాలి.. మా తండ్రి రామారావు గారిని ఎవరు పరిశ్రమకు తీసుకువచ్చారు.? ఎవరు వేన్ను తట్టి నడిపించారు.? కేవలం ఒంటరిగానే వచ్చారు కదా. అలా బాలకృష్ణ కూడా ఎలా ఎదిగారు మా నాన్నగారు ఎప్పుడైనా నా బిడ్డను పైకి తీసుకురమ్మని ప్రజలను కోరారు లేదు కదా.. ఇక నేను కూడా నాన్నగారికి డ్రైవర్ గా పని చేశాను.. మా సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న కూడా చీఫ్ కంట్రోలర్ గాని పేరు వేసుకున్నాను అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేను పైకి వచ్చాను కాబట్టే.. ఎవరికి వాళ్లే పైకి రావాలి.. ఎన్టీఆర్ స్వయం శక్తితో పైకి వస్తుంటే చూస్తూ ఆనందించడంలో తండ్రి ఎంతో గొప్ప అనుభూతి పొందుతున్నాను అని తెలియజేశారు.

Share post:

Latest