యంగ్ హీరోలు ఈ మధ్యకాలంలో తమ హవా చూపిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో కుర్ర హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ మాత్రం ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాప్ లను చవి చూస్తున్నారు. మొదట ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామ దాస్, హీట్ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ ను అందుకున్నారు. దీంతో విశ్వక్ సేన్ టాలెంటెడ్ హీరోగా కూడా గుర్తింపు పొందారు. కాకపోతే మొదటి నుంచి ఇతను మాట్లాడే విధానం, ఇతని యాటిట్యూడ్ వల్ల ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా విజయ్ దేవరకొండ ల తను కూడా తన ఆటిట్యూడ్ తో క్రేజీ ఏర్పరచుకున్నారని చెప్పవచ్చు.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇతను డైరెక్టర్లు చెప్పినట్లు వినకుండా మీడియా అంటే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు విశ్వక్ సేన్. ఎక్కువగా పలు వివాదాలలో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలెక్షన్లను కూడా రాబట్టలేకపోతున్నాయి చిత్రాలు. సరైన బ్రేక్ ఈవెన్ లేక విశ్వక్ సేన్ చాలా సతమతమవుతున్నారని తెలుస్తోంది. అయినా సరే ఇతని సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ మార్కెట్ బాగానే పెంచుకుంటున్నారు.
ఇటీవల విడుదలైన ముఖచిత్రం సినిమాని విశ్వక్ పేరు చెప్పి బాగానే అమ్ముకున్న నిర్మాతలు ఈ సినిమా ఇప్పటివరకు 50 శాతాన్ని కూడా రికవరీ సాధించలేదట. దీంతో బయ్యర్లు నష్టాలని చవిచూస్తున్నట్లు సమాచారం. ఇందులో నిర్మాతల తప్పు కానీ విశ్వక్ తప్పు కాని లేదు కేవలం అతను హీరోగా నటించిన సినిమాలకే కలెక్షన్లు రావడం లేదు.. అలాంటిది.. గెస్ట్ రోల్ లో నటించిన సినిమాలకు ఎలా కలెక్షన్లు వస్తాయని ఎక్కువ రేటు కొనుగోలు చేశారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా తన సినిమాల హవా కొనసాగించుకుంటే విశ్వ కెరియర్ ముగిసినట్లే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.