సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్న వెంకటేష్.. ఏమిటంటే..?

వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం నారప్ప. ఈ చిత్రాన్ని కోలీవుడ్లో హీరో ధనుష్ నటించిన ఆసురన్ అనే చిత్రం నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. కరోనా సమయంలో తప్పని పరిస్థితులలో ఈ చిత్రాన్ని ఓటిటి దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక మాస్ హీరోగా కనిపించారు. దీంతో అటు ఓటిటి అభిమానులు, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని దగ్గుపాటి అభిమానుల సైతం కోరుకుంటున్నారు.ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది.

Narappa movie review: Venkatesh is earnest in textbook remake of Dhanush's  Asuran, film underplays caste angle - Hindustan Timesఅయితే ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసిన కేవలం ఒక్కరోజు మాత్రమే అన్నట్లుగా సమాచారం. అది కూడా వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రేక్షకుల డిమాండ్ ను బట్టి అది ఒక్క షోన లేకుంటే నాలుగు షోల అన్న విషయం పై ఆధారపడి వుంటుంది. వెంకటేష్ పుట్టినరోజు వాస్తవానికి బొబ్బిలి రాజా, జయం మనదేరా సినిమాలను విడుదల చేయవలసి ఉన్నదట. కానీ f-3 సినిమా చివరిలో నారప్ప గెటప్ తో వచ్చిన వెంకటేష్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగిందట.

దీంతో నారప్ప సినిమాని రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఓరి దేవుడా చిత్రంలో గెస్ట్ పాత్రలో వచ్చి బాగా అలరించారు. మరి రీ రిలీజ్ కానున్న నారప్ప సినిమా ప్రేక్షకులను క్ మెప్పిస్తుందో లేదో చూడాలి.ఓటిటి లో విడుదలైన తర్వాత ఈ మధ్యకాలంలో థియేటర్లో విడుదలవుతున్న చిత్రం ఇదే.