నట కిరీట రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కామెడీ సినిమాల హీరోగా ఎన్నో సినిమాలలో నటించి నటకిరీటి అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాలలోకి వచ్చినప్పటి నుంచి కామెడీ ప్రధానంగా.. తరచూ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు గారి ఎంకరేజ్మెంట్ తోనే నటుడిగా మారిన రాజేంద్రప్రసాద్ చాలా పర్ఫెక్ట్ గా పని చేయాలనుకునే ఏకైక వ్యక్తి అని చెప్పవచ్చు.
కెరియర్ ప్రారంభం నుంచి వరుస సినిమాలతో బిజీ అయిన ఆయన అప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉండడంతో ఏ తరహా సినిమాలు చేయాలనే ఆలోచనలో కూడా పడ్డారు రాజేంద్రప్రసాద్. ఈ క్రమంలోని ఎన్టీఆర్ దగ్గరకి సలహా కోసం వెళ్ళిన ఆయన.. ఇప్పటివరకు సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ఉంది.. కొంతమంది కమెడియన్స్ మాత్రమే ఆ సీన్ చేయడానికి పనికొస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో కామెడీ చేసే హీరో అయితే చాలా బాగుంటుంది.. అలాంటి హీరో ఇప్పటివరకు లేరు .. కాబట్టి నువ్వు అదే క్రియేట్ చేసి కామెడీ హీరోగా మారు.. నీకు కచ్చితంగా ప్లస్ అవుతుంది అంటూ సలహా ఇచ్చారట.
అలా అన్నగారి సహాయంతో రాజేంద్రప్రసాద్ కామెడీ చిత్రాలు చేసి.. ప్రేక్షకులను అలరించారు. దాదాపుగా ఏ హీరో సినిమాలైనా సరే రెండు మూడు సార్లు చూస్తే బోర్ కొడతాయేమో కానీ రాజేంద్రప్రసాద్ సినిమాలు ఎన్నిసార్లు చూసినా ఎక్కడ కూడా బోరు కొట్టదు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనా తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన రాజేంద్రప్రసాద్ ఇప్పుడు తన ఎమోషనల్ సన్నివేశాలతో అందరినీ కంటతడి పెట్టిస్తున్నారు.