విశాల్ డిటెక్టివ్-2 పై క్లారిటీ ఇదే..!!

హీరో విశాల్ ల్ నటించిన డిటెక్టివ్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మిస్కిన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్ చిత్రం అందరిని బాగా ఆకట్టుకుంది. విశాల కెరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ డిటెక్టివ్-2 కూడా సెట్స్ పైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి విశాల్ ఏకంగా ఈ చిత్రం కోసం డైరెక్టర్గా కూడా మారిపోయారు.

Watch Detective - Disney+ Hotstarడైరెక్టర్ మిస్కిన్ అందించిన ఈ కథకు విశాల్ డైరెక్టర్ చేసి ఈ సినిమా పైన అంచనాలకు అంతకంతకు పెంచేస్తూ ఉన్నారు. మరి మీస్కిన్ ఈసారి డైరెక్టర్ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకున్నారు.. అన్న సంగతి ఎవరికీ తెలియదు.? కానీ కథ ఆయనే అందించడం సహా దర్శకత్వం పర్యవేక్షణ కూడా ఆయన చేతుల మీదికి జరుగుతూ ఉండడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా చాలా రోజుల క్రితమే సెట్స్ పైకి తీసుకువెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో విశాల్ వేరు వేరు సినిమా షూటింగ్లో పాల్గొనడంతో డిటెక్టివ్-2 కాస్త ఆలస్యమైందనే వార్తల విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు విశాల్.

విశాల్ ఈ సినిమా గురించి పలు విషయాలు తెలియజేస్తూ 2023 ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సినిమా బాగా వస్తుందని అంచనాలకు అందుకుంటా కథ కథనాలు బాగా సాగుతున్నాయని తెలిపారు. సరికొత్త పాయింట్ తో ఈ సినిమాను తీసుకు వస్తున్నట్లు రివిల్ చేయడం జరిగింది. ఇది విశాల్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ సినిమా తనకంటే ప్రేక్షకులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారని తెలియజేశారు. త్వరలోనే విశాల్ నటించిన లాఠీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి చిత్రంతో విశాల్ ఆకట్టుకుంటారేమో చూడాలి.