ఈ కుర్ర హీరో ఆ స్టార్ హీరోల కంటే తోపా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో యంగ్ అండ్ టాలెంట్ హీరో అడవి శేషు కూడ ఒకరని చెప్పవచ్చు. అంతేకాకుండా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వారిలో అడవి శేషు ఒకరు. ఇటీవల కాలంలో స్టార్ హీరోల కంటే ఎక్కువ రేంజ్ లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అడవి శేషు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో డిఫరెంట్ పాయింట్ ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని సినిమాని తెరకెక్కించడం వల్ల నేటి యువతరంకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయి.

Adivi Sesh: It took a film like Baahubali for people to realise that south  films aren't just popular on TV - Hindustan Timesతెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోవి అయినా ఒకేసారి ఆరు సినిమాలు సక్సెస్ కావడం చాలా తక్కువ అని చెప్పవచ్చు కానీ అడవి శేషు సినిమాలు సక్సెస్ అయ్యాయి. కెరీర్ మొదట్లో కొన్ని నెగటివ్ పాత్రలో కూడా నటించాడుvఅడవి శేషు. 2016లో హీరో పాత్రలు చేసి అవన్నీ వర్కౌట్ కూడా అయ్యాయి. చెప్పాలంటే అడవి శేషు ఎక్కువగా సస్పెన్షన్ థ్రిల్లర్స్ మూవీస్ లతో విజయాలను సాధించాడు. అంతేకాకుండా అమీ తుమీ లాంటి కామెడీ సినిమా కూడా చేశాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన మేజర్ సినిమా అడవి శేషు రేంజ్ను ఇంకాస్త తిరిగేలా చేసిందని చెప్పవచ్చు. క్షణం సినిమా నుంచి హిట్ 2 సినిమా వరకు వరుస సక్సెస్ లనే అందుకున్నాడు. ఇలా ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోలు అందుకోలేకపోయారు.

ఇక కేవలం ఇవన్నీ డైరెక్టర్ల ఆలోచనలు కాదు. అడవి శేషు కూడా తన కథ విషయంలో ఆచితూచి అడుగేస్తాడు.అవసరమైతే తానే రచయితగా మారుతాడు. తన ప్రతి సినిమాకు సంబంధించి కథ విషయంలో తన పాత్ర లేనిదే సినిమా మొదలుపెట్టరు. ఈ విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన కమాండ్ సెట్ చేసుకుంటాడు. ఇటీవల ఏ హీరోకు అందని రికార్డులను అడవి శేషు సొంతం చేసుకున్నాడని చెప్పవచ్చ. ఇప్పుడు హిట్టు 2 సినిమాతో పెద్ద సక్సెస్ను అందుకని రికార్డు సృష్టించాడు. రాబోయే రోజుల్లో అడవి శేషుకు తన సినిమాలు ఇంకా ఎంత పెద్ద సక్సెస్ ను తెచ్చి పెడతాయో చూడాలి మరి.