మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమాని త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. ఇప్పటికే ధమాకా సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. ధమాకా సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.
శ్రీ లీల మాట్లాడుతూ తనకు ధమాక చిత్రంలో అవకాశం ఎలా వచ్చిందో తెలుపుతూ.. డైరెక్టర్ త్రినాధరావు నక్కిన గారు హలో గురు ప్రేమ కోసం చిత్రంలో ఒక రోల్ కోసం తనని సంప్రదించారని.. ఆ టైంలో రైటర్ ప్రసన్న గారు కూడా పరిచయమయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేకపోయాను.. పెళ్లి సందD సినిమా విడుదల కాకుండానే ధమాకా చిత్రం కథ వినిపించారు. దీంతో ఓకే చెప్పానని తెలిపింది. కథ విన్న పది నిమిషాలకి ఈ సినిమాకు ఓకే చెప్పానని తెలియజేసింది.
ధమాకా సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అని చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందని తెలియజేస్తోంది. ముఖ్యంగా తనకు కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాలంటే చాలా ఇష్టం అని అందుకే ఒప్పుకున్నానని తెలియజేసింది. ముఖ్యంగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నోసార్లు ట్రోల్స్ వినిపిస్తూ ఉంటాయి వాటి గురించి పట్టించుకోకూడదంటూ తెలియజేసింది. ముఖ్యంగా యంగ్ హీరోయిన్లు ఇతర హీరోలతో నటించడంపై ట్రోల్స్ చాలామంది హీరోయిన్స్ కూడా ఎదుర్కొన్నారని తెలియజేస్తోంది.
డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు వంటి పెద్ద దర్శకులు సపోర్టు కారణంగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను..ఆ వెంటనే రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.