సౌందర్య – అనుష్క మధ్య బంధం ఇదేనా..!

అనుష్క.. లేడీస్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమెను ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ ని చేసిన సినిమా అరుంధతి.. ఈమె కెరియర్ సినిమా ముందు.. తర్వాత అని చెప్పుకునేదిగా మార్చేసింది ఈ సినిమాయే.. కథ, కథనాలు.. కథకు తగ్గట్టుగా అద్భుతమైన విజువల్స్.. అనుష్క పెర్ఫార్మన్స్.. కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ .. అరుంధతి సినిమాను బ్లాక్ బస్టర్ నిలిచేలా చేశాయి. అయితే ఇదే అరుంధతి పేరుతో సౌందర్య కూడా 1999 లోనే సినిమా చేశారన్న విషయం చాలామందికి తెలియదు. తర్వాత పదేళ్లకు 2019లో అనుష్క అరుంధతి సినిమాను తెరకేక్కించారు.

సౌందర్య సినిమా విషయానికి వస్తే.. అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పాపులర్ యాక్టర్ కాస్ట్యూమ్స్ కృష్ణ సమర్పణలో కొల్లి వెంకటేశ్వరరావు నిర్మించారు. మహిళా ప్రాధాన్యత కలిగిన కథలతో చిత్రాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు క్రాంతికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ కుమార్.. శ్రీవిద్య, కిన్నెర, మేఘన, రాధిక, విజయ్ కుమార్, తనికెళ్ల భరణి ,బెనర్జీ , ఎల్బీ శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కాస్ట్యూమ్స్ కృష్ణ తదితరులు ఈ సినిమాలో నటించారు.

అరుంధతికి ది అల్టిమేట్ ట్రిబ్యూట్ టు ఏ వుమెన్.. అంటే ట్యాగ్ ఇచ్చినప్పుడే దర్శకుడు ఎప్పటిలాగే తన శైలిలో మహిళ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా చేయబోతున్నాడని ఆడియన్స్ ఫిక్సయ్యారు. ఈ సినిమాలో శ్రీవిద్య, సౌందర్య తల్లి కూతుర్లుగా కనిపించడం.. తర్వాత నిజమైన తల్లి కాదని తెలియడం.. తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం..మధ్యలో ప్రేమ ఇలా సాగిపోతుంది ఈ సినిమా. అయితే అప్పట్లో సౌందర్యకి విపరీతమైన క్రేజ్ ఉండేది పోస్టర్ మీద ఆమె ఫోటో చూసి థియేటర్లోకి వచ్చేవారు ఆడియన్స్.. కానీ సినిమా మితిమీరిన ఓవర్ డ్రామా కారణంగా అట్టర్ ప్లాప్ అయ్యింది. క్లైమాక్స్ లో సౌందర్య, శ్రీదేవి క్యారెక్టర్లు ఒకేసారి చనిపోవడం బాగోద్వేగానికి గురి చేస్తుంది. వీరిద్దరూ ఒకే సినిమా టైటిల్ తో తెరపైకి వచ్చినా సౌందర్య సక్సెస్ పొందలేదు కానీ అనుష్క తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.