నా లైఫ్ లో అవే అత్యంత క‌ష్ట‌మైన ప‌నులు అంటున్న శ్రుతి హాస‌న్‌!

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్-సారికల కుమార్తె శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఈ అమ్మడు తనదైన టాలెంట్ తో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.

ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ నట‌సింహం నందమూరి బాలకృష్ణ కు జోడిగా `వీరసింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవితో `వాల్తేరు వీరయ్య` చిత్రాలు చేస్తుంది. అలాగే ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న `సలార్` చిత్రంలో భాగమైంది. మరోవైపు కోలీవుడ్, హాలీవుడ్ లోనూ సినిమాలో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సంద‌ర్భంగా ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. త‌న జీవితంలో అత్యంత క‌ష్ట‌మైన ప‌నులు ఏంటో కూడా తెలిపింది.

సినిమాల్లో ఎన్ని దోస్తులు మార్చినా.. మరెన్ని పాత్రలు పోషించినా నిజజీవితంలో మాత్రం మనసుకు నచ్చినట్టుగానే జీవిస్తానని శ్రుతిహాసన్ పేర్కొంది .అలాగే అందరికి నచ్చేలా బట్టలు వేసుకోవడం, మాట్లాడడం, ప్రవర్తించడం, ప్రపంచాన్ని ఆవిష్కరించడం వంటివి తనకు లైఫ్ లో అత్యంత కష్టమైన‌ పనులని చెప్పుకొచ్చింది. ఎదుటివారిని తృప్తి పరచాల‌నుకోకుండా తనకు నచ్చిన విధంగా జీవించడమే సంతోషాన్ని కలిగిస్తుందని శ్రుతి హాసన్ తెలిపింది. దీంతో ఈమె కామెంట్ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారాయి.