టాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ కపుల్స్ లో మహేష్ బాబు- నమ్రత కూడా ఒకరు. ఇక వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు గౌతమ్, సీతారా అనే ఇద్దరు పిల్లలు, అయితే పెళ్లి తర్వాత నమ్రత నటనకు స్వస్తి చెప్పి ఘట్టమనేని ఇంటి బాధ్యతలను అందుకుంది. సూపర్ స్టార్ భార్యగా పిల్లలకు తల్లిగా, బిజినెస్ ఉమెన్ గా రానిస్తుంది. ఎప్పుడు మహేష్ కు అండగా ఉండే నమ్రత బయట కనిపించడం కానీ, మహేష్ లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చాలా తక్కువ అయితే రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కు నమ్రత ఇంటర్వ్యూ ఇచ్చింది.
![Mahesh Babu brings Namrata, Gautam and Sitara together to surprise his fans this Diwali [Video] - IBTimes India](https://data1.ibtimes.co.in/en/full/724788/mahesh-babu-family-new-tvc-ad.jpg)
అందులో తన ఫ్యామిలీ లైఫ్ పూర్తి వివరాలను వివరించింది. తన కెరీర్‌ను మోడల్‌గా మొదలు పెట్టినప్పటి నుంచి ఏం జరిగిందో ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మనం ఏ పని చేస్తున్న అది సీరియస్ గా చేయాలని తన నానమ్మ చెప్పిన విషయం చెప్పుకొచ్చింది. మోడల్‌గా బోర్ కొట్టి హీరోయిన్గా ట్రై చేసిన్నట్లు నమత్రా చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉంటాయి.. మీ జీవితంలో కూడా అలాంటి గొడవలు ఎవరి వల్ల వస్తాయి అన్న ప్రశ్నకు.. నమ్రత స్పందించింది.

” అవును మా ఇద్దరి మధ్య కూడా గొడవలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఆ గొడవలు మా పిల్లల వల్లే వస్తాయి.. వాళ్లు ఏదైనా కావాలని కోరుకుంటే దాన్ని నేను వద్దు అంటాను.. వెంటనే వారు మహేష్ దగ్గరకు వెళ్ళటం ఆయన ఒప్పుకోవటం అలా జరగబోతూ ఉంటాయి. అప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు వస్తుంటాయని చెప్పుకొచ్చింది”. ఇక మహేష్ సినిమాల్లో తనకు పోకిరి సినిమా అంటే చాలా ఇష్టం అని, మేమిద్దరం కలిసి నటించిన వంశీ సినిమా కూడా తనకు నచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

