తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరో సత్య దేవ్ విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఇటు వైవిధ్యభరితమైన సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు వేసేవాడు. ఆ తర్వాత లీడ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాధించాడు. యువతను, ఫ్యామిలీని ఆకట్టుకునే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన భయానక అనుభవం గురించి తెలియజేశాడు.
ఓ సినిమా షూటింగ్ కోసం ఆఫ్ఘనిస్థాన్ కు సత్యదేవ్ టీమ్ వెళ్లిందంట. ఆ సమయంలో తనకు ఎదురైన విచిత్ర అనుభవం గురించి సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఆఫ్ఘనిస్థాన్ పోలీసులు సత్యదేవ్ ను చుట్టుముట్టారు. ఎయిర్ పోర్ట్ లో తనను అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. అయితే ఆ సమయంలో తనను ఎందుకు అరెస్టు చేశారో సత్యదేవ్ కు తెలియలేదంట. చిత్ర యూనిట్ ఎంక్వైరీ చేయగా ఓ షాకింగ్ విషయం తెలిసింది.
సత్యదేవ్ ను ఆఫ్ఘనిస్థాన్ పోలీసులు సూసైడ్ బాంబర్ అనుకుని అరెస్టు చేసినట్లు తెలిసి చిత్ర యూనిట్ షాక్ అయ్యారు. సూసైడ్ బాంబర్స్ ను కాలికింద పెట్టుకుని ఆపరేట్ చేసేవాడిలా సత్యదేవ్ పక్కనున్న వ్యక్తి ఆఫ్ఘన్ పోలీసులకు కనిపించాడు. ఆ సమయంలో వారు అనుమానిత వ్యక్తితో పాటుగా సత్యదేవ్ ను కూడా అరెస్ట్ చేశారు.
ఎయిర్ పోర్టులో సత్యదేవ్ ను ఆఫ్ఘన్ పోలీసులు అరెస్ట్ చేసి వాదిస్తుండగా చిత్ర యూనిట్ సభ్యులు అక్కడికి చేరుకుని సత్యదేవ్ గురించి చెప్పారు. తాము షూటింగ్ కోసం వచ్చామని చెప్పడంతో ఎయిర్ పోర్టులోని పోలీసులు సత్యదేవ్ ను విడిచిపెట్టారు. ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేనిదని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.