మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీలో మ‌రో హీరో.. అలాగైతే సినిమా సూప‌ర్ హిట్టే!

`సర్కారు వారి పాట` వంటి సూపర్ హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా యంగ్‌ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ సైతం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ తో పాటు మరో హీరో కూడా ఉండబోతున్నాడట. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో సెకండ్ హీరోగా `పాఠశాల`, `ప్రెజర్‌ కుక్కర్‌` వంటి చిత్రాల‌తో పాపుల‌ర్ అయిన సాయి రోనాక్ ను తీసుకున్నారట.

ఇతడి పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, త్రివిక్రమ్ గ‌త చిత్రం `అలా వైకుంఠపురంలో`నూ అక్కినేని సుశాంత్ ను సెకండ్ హీరోగా తీసుకున్నారు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సెకండ్ హీరో సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయితే మహేష్ సినిమా సైతం సూపర్ హిట్టే అని పలువురు సినీప్రియలు అభిప్రాయపడుతున్నారు.

 

Share post:

Latest