కేథరిన్ థ్రెసా..ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `చమ్మక్ చల్లో` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ `ఇద్దరమ్మాయిలతో` గుర్తింపు పొందింది. ఆ తర్వాత వరసగా సినిమాలు చేసింది. కానీ సరైన హిట్టు మాత్రం పడలేదు. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎక్కడ కేథరిన్ కు స్టార్ హోదా దక్కలేదు.
ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో ఈ బ్యూటీకి `బింబిసార` రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి సంచన్న విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ తర్వాత అయినా కేథరిన్ మళ్లీ ఫామ్ లోకి వస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. అడపా అవకాశాలు మాత్రమే కేథరిన్ అందుకుంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా బ్యూటీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేథరిన్ వయసు 33 ఏళ్లు. అయినా సరే పెళ్లి వైపు చూడటం లేదు. తాజాగా పెళ్లెప్పుడు..? అని ఆమెను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. `తొందరేముంది ఇప్పుడప్పుడే కాదు. ఇంకో ఐదేళ్ల వరకు పెళ్లి వైపు చూడను` అని చెప్పేసింది. అయితే సెన్సాఫ్ హ్యూమర్, తగినంత హైట్, కొంచెం అందంతో పాటు ఫుడ్ పట్ల తన లాంటి ఇష్టాలు కలిగి ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని కేథరిన్ ఈ సందర్భంగా తెలిపింది.