ప్రగ్యా జైస్వాల్.. ఈ అందాల సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఓ బాలీవుడ్ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని భావించింది. తనదైన టాలెంట్ తో వరుస ఆఫర్లను అందుకుంది.
కానీ ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఇక కెరీర్ క్లోజ్ అనుకుంటున్న తరుణంలో అఖండ సినిమాలో నటించే అద్భుత అవకాశాన్ని అందుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఈ సినిమా తర్వాత ప్రగ్యా దశ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ ప్రగ్యాకు అవకాశాలే కరువయ్యాయి దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పొట్టి నిక్కర్ లో ఫ్లోర్ షేక్ అయ్యేలా ఓ ఇంగ్లీష్ సాంగ్ కు డాన్స్ చేసి ఇరగదీసింది. ఎందుకు సంబంధించిన వీడియోను ప్రగ్యా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ వీడియోలో ప్రగ్యాతో పాటు మరో యువతి కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Glamorous #PragyaJaiswal pic.twitter.com/u7OjWGorBs
— Southern Trends (@TrendsSouthern) December 16, 2022