బాల‌య్య షోలో ప్ర‌భాస్ క‌ల‌ర్‌ఫుల్ లుక్‌.. అభిమానులంతా అదే మాట‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ పై గ‌త కొంద కాలం నుంచి నెట్టింట రకరకాల ట్రోల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు చూసినా బ్లాక్ షర్ట్స్ లో కనిపిస్తున్నాడు. పైగా తలకు క్యాప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు. సొంత అభిమానులు సైతం ప్రభాస్ లుక్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో ప్రభాస్ పాల్గొన్నాడు.

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఈ షోకు హోస్ట్ గా వ్యహరిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్స్‌తో కూడిన చెక్ షర్ట్‌లో ప్ర‌భాస్ ఎంతో క‌ల‌ర్ ఫుల్ గా క‌నిపించాడు. కొత్త హెయిర్ కట్, కాస్త పెంచిన గెడ్డంతో చాలా హ్యాండ్‌సమ్‌గా క‌నిపిస్తూ ఆక‌ట్టుకున్నాడు.

ప్రభాస్‌ లుక్ కు అభిమానులే కాదు నెటిజ‌న్లు సైతం ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే అభిమానులంతా `ఇలా నిన్ను చూసి ఎన్ని రోజులైంది అన్నా` అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే సూపర్ డార్లింగ్., ఇలానే ఎప్పుడు క‌ల‌ర్‌ ఫుల్ గా కనిపించు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ తాజా లుక్‌ అయితే ఫ్యాన్స్ కు పిచ్చిపిచ్చిగా నచ్చేసింద‌ని చెప్పాలి.

 

Share post:

Latest