వెకేషన్ నుంచి సరికొత్త పోస్ట్ షేర్ చేసిన ఎన్టీఆర్..!!

ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30 వ సినిమాకు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకులాడుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రం ఎన్నో సందర్భాలలో సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన కుటుంబానికి తమ పిల్లలకు సంబంధించి ఎన్టీఆర్ ఫోటోలను షేర్ చేసి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ యొక్క కొత్త లుక్ ఇటీవలే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

ఇప్పుడు తన భార్యతో కలిసి వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలోని అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఫోటో ను అభిమానులతో పాటు , నందమూరి అభిమానులు కూడా ఈ ఫోటోను తెగ లైక్ చేస్తున్నారు. సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నప్పటికీ తన భార్య లక్ష్మీ ప్రణీత కి , తమ ఇద్దరి కొడుకులకు సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ఎన్టీఆర్. అలా ఎన్టీఆర్ తన ఎంజాయ్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేయడంతో కన్నుల విందుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కు తన భార్యపై ఉన్న ప్రేమను ఈ ఫోటోలో ప్రత్యక్షంగా చూడవచ్చు అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం RRR సినిమా సక్సెస్ ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. వచ్చేయేడాది డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)