మ‌హేష్ బ‌య‌ట‌కు వెళ్తే అలాంటి ప‌ని అస్స‌లు చేయ‌ను.. న‌మ్ర‌త షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. `వంశీ` సినిమా సమయంలో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్లపాటు వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం నడిపించారు. 2005లో మహేష్ నమ్రత వివాహం జరిగింది. ఈ దంపతులకు 2006లో గౌతమ్. 2012లో సితార జన్మించారు. పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన నమ్రత.. పిల్ల‌ల‌ను చూసుకుంటూ భర్తకు ప్రతి విషయం లోను చేదోడువాదోడుగా నిలిచింది.

అలాగే నమ్రత ను పెళ్లి చేసుకున్నాకే మహేష్ కెరీర్ ఊపందుకుంది. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందాడు. పైగా పెళ్లై ఇన్నేళ్లు గ‌డుస్తున్నా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఈ జంట ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత తన ఫ్యామిలీ గురించి, దాంపత్య జీవితం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

 

త‌మ దాంప‌త్య జీవితం గురించి న‌మ్ర‌త మాట్లాడుతూ.. `ఇద్దరి వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటే ఏ బంధమైన సంతోషంగా సాగుతుంది. మహేష్‏తో నా వివాహం జరిగి 17 ఏళ్లు అవుతుంది. పెళ్లి కాకముందు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌. అన్ని విషయాలను పంచుకునేవాళ్లం. మా మధ్య రహస్యాలు, అనుమానాలు, అపనమ్మకాలకు చోటు లేదు. ఒకవేళ ఆయన ఎప్పుడైనా బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్లావు ? ఎవరితో ఉన్నావు ? ఏం చేస్తున్నావు ? అని పదిసార్లు ఫోన్లు చేసి అస్స‌లు విసిగించను. అనుమానించను. ఆయన కూడా అంతే. న‌న్ను ఎప్పుడు అనుమానించ‌లేదు. ఇక గౌతమ్.. సితార పుట్టిన తర్వాత మా జీవితం ఎంతో అద్భుతంగా మారింది.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో న‌మ్ర‌త కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.