వీర‌య్యా.. మేల్కోవ‌య్యా.. మెగా ఫ్యాన్స్ స్పెష‌ల్ రిక్వస్ట్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. ప్రముఖ దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపదిద్దుకుంటున్న మాస్‌ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంటే.. మాస్‌ మహా రాజా రవితేజ, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్ బ్యాన‌ర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఈ మూవీ తో పోటీ పడుతున్న `వీర‌ సింహారెడ్డి`, `వారసుడు` చిత్రాల నుంచి రిలీజ్ డేట్ అప్డేట్స్ వచ్చేశాయి.

ఈ రెండు చిత్రాలు జనవరి 12న విడుదల అయ్యేందుకు ముస్తాబు అవుతున్నాయి. కానీ ఇప్పటివరకు `వాల్తేరు వీర‌య్య‌` నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో మేగా ఫ్యాన్స్ మరియు పులువురు సినీ ప్రియులు వీరయ్య రిలీజ్ డేట్ విషయంలో మేల్కోవ‌య్యా అంటూ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వస్తుందా లేదా అన్నది చూడాలి.