ఈ ఇద్దరి సీనియర్ హీరోయిన్స్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేదట తెలుసునా?

అలనాటి సీనియర్ హీరోయిన్లు జమున, జయలలిత గురించి తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్ లలో ఒకరు తెలుగు స్టార్ హీరోయిన్ గా ఎదిగితే మరొకరు తమిళం లో స్టార్ హీరోయిన్ ఎదిగి అక్కడితో ఆగకుండా ఏకంగా ఆ స్టేట్ కి CM స్థానాన్ని అధిరోహించారు. అయితే ప్రేక్షకులకు వీరి గురించి తెలియని ఓ గమ్మత్తైన విషయం ఒకటుంది. వీరి మధ్య కోపతాపాలు, గొడవలు ఉండేవట. వీరిద్దరూ కలిసి చాల తక్కువ గానే నటించినప్పటికీ గొడవకి ఆస్కారం ఏముందని అనుకుంటున్నారా?

ఈ ఇద్దరిలో జమున జయలలిత కన్నా సీనియర్ అని చెప్పుకోవాలి. జయలలిత బేసిగ్గా మితభాషి. షూటింగ్ లో సీన్ ఉంటె చేసి వస్తుంది లేదు అంటే ఒక పక్కన కూర్చొని ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతూ ఉండేదట. అప్పట్లో హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ బాగా చదువుకున్న దాఖలాలు లేవు. అలాంటి టైంలో జయలలిత బాగా పై చదువులు చదువుకుందట. అందుకే ఆమెను చూస్తే తోటి హీరోయిన్స్ బాగా అసూయ ఫీల్ అయ్యేవారట. పైగా ఆమె ఒక ఎవరితో మాట్లాడకపోవడం వాళ్ళ ఆమె పెద్ద ఇగోయిస్టు అని అనుకునేవారు.

ఈ క్రమంలో ఒక రోజు షూటింగ్ లొకేషన్లో ఉండగా జమున అక్కడికి రాగా జయలలిత లేచి విష్ చేయలేదట. అయితే ఆమె కూడా అప్పట్లో కాస్త గర్వంతో ఉండేదట. దాంతో నేరుగా జయలలిత దగ్గరికి వెళ్లి సీనియర్ వస్తే లేచి విష్ చేయడం తెలియదా? అని అడిగిందట. దానికి జయ లలిత మాకు అలాంటి ఫార్మిలీటీస్ పెద్దగా లేవు అని చెప్పిందట. దాంతో జమునకు ఇంకా మండిపోయిందట. అలాగే ఎదో ఒక సీన్లో జయలలిత గట్టిగా ఏడవడం వలన జమున కలుగజేసుకొని అంత గట్టిగా ఏడిస్తే నా డైలాగ్ ఏమైపోవాలి? అని అడిగిందట. అంతేకాకుండా కోపంతో జమున షూటింగ్ నుంచి వెళ్లిపోతుంటే సదరు నిర్మాణ సంస్థ జయలలితని మందలించిందట.