వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోలు పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సంక్రాంతి పోరులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా దిగబోతున్నాడు. అసలు ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం మహేష్ నటించిన పోకిరి సినిమాను రీ రిలీజ్ చేయగా అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు `ఒక్కడు` చిత్రాన్ని థియేటర్స్ లో దించేందుకు సిద్ధమవుతున్నారు. మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒక్కడు ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించింది.
ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తే.. మణిశర్మ స్వరాలు అందించాడు. అయితే ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా జనవరి 7న ఒక్కడు సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక సంక్రాంతికి మహేష్ వస్తున్నాడని తెలియగానే ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి రీ రిలీజ్ లో ఒక్కడు ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.