పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని.. ఫ్యాన్స్ ని ఖుషి చేసిన మహేశ్ బాబు..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ కొద్దిరోజుల క్రితమే మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఊహించని పరిణామంతో ఆయన కొడుకు మహేష్ బాబు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు . అంతేకాదు సరిగ్గా ఆయన మరణించే మూడు నెలల ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు మరణించారు . ఇలా వరుసగా మూడు నెలల వ్యవధిలోనే విషాదాలు ఘట్టమనేని ఫ్యామిలీని చుట్టుముట్టడం ఫ్యాన్స్ ను తీవ్ర శోకంలో ముంచేసింది .

ఈ క్రమంలోనే డిప్రెషన్ కి లోనైనా మహేష్ బాబు కొన్ని వారాలు పాటు ఫర్ కంట్రీస్ లో రిలాక్స్ అయ్యి తన తదుపరి సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ఇండియా చేరుకున్నారు .అంతేకాదు తను నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదన్న కారణంతో తన బాధను పక్కనపెట్టి పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తున్న కూడా ఫాన్స్ ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండాలని తల్లిదండ్రులు మరణించిన బాధ నుండి తన కొత్త సినిమాకి సంబంధించిన పనులను మొదలుపెట్టాడు .

మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తన 28వ సినిమాను చేస్తున్నాడు . ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించబోతున్నాడు . దాదాపు 12 ఏళ్ల తర్వాత కలిసిన ఈ క్రేజీ కాంబోలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం పై మరిన్ని భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు జనాలు. కాగా ఇలాంటి టైం లోనే మహేష్ సైతం ఎక్కడ కూడా తగ్గకుండా తన ఫుల్ ఎఫర్ట్స్ ని పెడుతున్నారు .

రీసెంట్గా మహేష్ బాబు తన స్టైలిష్ లుక్ ను అభిమానులతో పంచుకున్నారు. మహేష్ బాబు జిమ్ వర్క అవుట్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జిమ్ వేర్ లో ఫిజికల్ థెరపిస్ట్ డాక్టర్ మినాష్ గాబ్రియేల్ తో కలిసి స్టైలిష్ గా సెల్ఫీకి స్టిల్ ఇచ్చారు. చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని స్టైలిష్ పోజ్ లో అభిమానులను ఖుషీ చేశారు. అంతేకాదు మహేష్ బాబు అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి ఫోటో బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ చిల్ అవుతున్నారు. మహేష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఫోటోను మరింతగా వైరల్ చేస్తున్నారు.

Share post:

Latest