అనపర్తి ఎమ్మెల్యేకు సీటు డౌటా? ‘రెడ్డి’తో కష్టమే?

గత ఎన్నికల్లో వైసీపీకి చాలా నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలు వచ్చాయి. అయితే ఆ మెజారిటీలు ఎక్కువగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనే వచ్చాయి. ఇటు కోస్తా, ఉత్తరాంధ్రల్లో తక్కువ. కానీ కోస్తా జిల్లాల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే..అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. దాదాపు 55 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. నియోజకవర్గంలో రెడ్డి వర్గం ప్రభావం ఉండటం..అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత రావడం, 2014లో ఓడిపోయిన సానుభూతి సూర్యనారాయణరెడ్డికి ఉండటంతో..భారీ మెజారిటీ వచ్చింది.

అయితే అలా భారీ మెజారిటీతో గెలిచిన సూర్యనారాయణ రెడ్డిపై ప్రజలకు కూడా భారీగాన అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో సూర్యనారాయణ విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు. డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు గాని..రాజకీయ నాయకుడుగా అంతగా సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు. నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ..అవినీతి, అక్రమాలు ఎక్కువనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ నేత నల్లమిల్లి..ఈ ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారు..ఒకానొక సమయంలో దేవుడు మీద ప్రమాణాలు చేసుకునేవరకు వెళ్ళిపోయారు.

పైగా ఎమ్మెల్యే పెద్దగా ప్రజల్లోకి చొచ్చుకుపోవడం లేదని తెలుస్తోంది..అలాగే ప్రజా సమస్యలని పూర్తి స్థాయిలో పట్టించుకోవడంలోనూ విఫలమవుతున్నట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేత నల్లమిల్లి దూకుడుగా పనిచేస్తున్నారు. మళ్ళీ తన బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. పైగా నల్లమిల్లికి ఉన్న మాస్ ఫాలోయింగ్..ఎమ్మెల్యేకు లేదని చెప్పవచ్చు. దీంతో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి అనపర్తిలో అనుకూల వాతావరణం తక్కువ ఉంది.

ఈ క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కానీ రెడ్డి వర్గం నేత కాబట్టి..అంత తేలికగా సీటు ఇవ్వకుండా ఉండటం అనేది కష్టమే. నియోజకవర్గంలో కూడా రెడ్డి వర్గం ప్రభావం ఉంటుంది. మరి ఈ సమీకరణాలు బట్టి చూస్తే..మళ్ళీ సీటు దక్కకుండా ఉండటం అనేది జరిగే పని కాదు.