ఎట్టకేలకు ఎన్టీఆర్ చిత్రానికి ముహూర్తం కుదిరిందిగా..!

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఎన్టీఆర్ 30వ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ చిత్రం అనౌన్స్మెంట్ జరిగి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై చిత్ర బృందం ఏనాడూ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా మరొక విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది వాటి గురించి తెలుసుకుందాం.

NTR 30: Jr NTR's Next With Koratala Siva Officially Shelved? - Filmibeatఎన్టీఆర్ 30 వ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ వీడియోని విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న వార్త ఏమిటంటే డిసెంబర్ 17వ తేదీన ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ క్యాస్టింగ్ కూడా ఫైనల్ చేసినట్లుగా ఎన్టీఆర్ తెలుస్తోంది.

Fury of #NTR30 - Telugu | NTR | Koratala Siva | Anirudh Ravichander -  YouTubeముఖ్యంగా ఎన్టీఆర్ కి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్తులు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ కి విలన్ గా నటించడం కోసం సంజయ్ దత్తు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే యంగ్ హీరోయిన్ అనన్య పాండే ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మరొకపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరటాల సినిమా పైన భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారా అని ఆత్రుతగా ఉన్నారు . ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన సమాధానం దొరకబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.