లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్.. ఖ‌రీదు తెలిస్తే మైండ్ బ్లాకే!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఈయన.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న‌ ఈ చిత్రం త్వరలోనే సెకండ్ ఇయర్ షెడ్యూల్ కోసం సిద్దమవుతుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా త్రివిక్రమ్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. కొత్త‌ కారు తన కోసం కాకుండా తన సతీమణి సౌజన్యకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు కొన్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కొనుగోలు చేసిన కారు ధర మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంది. త్రివిక్రమ్ బిఎండబ్ల్యూ 7 సిరీస్ 740 లీటర్స్ మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారు ధర మార్కెట్లో 1.34 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్, ఆయన సతీమణి సౌజన్య ఇద్దరూ షో రూమ్ వద్ద కారు ఎదుట నిలబడి కీస్ తీసుకుంటున్న ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.