మెగాస్టార్ చిరంజీవి త్వరలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. కేవలం రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సాంగ్స్ ఫారెన్ లో చిత్రీకరించబోతున్నారు. ఇందులో భాగంగానే వాల్తేరు వీరయ్య టీం యూరోప్ బయలుదేరింది. దాదాపు 15 రోజులు పాటు అక్కడే షూటింగ్ జరగనుందని తెలుస్తుంది.
ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా రెండు ఫోటోలు పంచుకున్నారు. అందులో ఒకటి ఫ్యామిలీతో కలిసి ఉండదైతే.. మరొకటి శ్రుతిహాసన్ తో కలిసి ఉన్నది. `ఫ్యామిలీతో అటు విహారయాత్ర.. హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర` అంటూ చిరంజీవి ఈ రెండు ఫోటోలను ఉద్దేశిస్తూ క్యాప్షన్ పెట్టారు. మొత్తానికి విహారయాత్ర, వీరయ్య యాత్ర రెండు ఒకేసారి కానిచేస్తున్నారు చిరు.