సెక్స్ పాఠాలు చెబ్బుతున్న స్టార్ హీరో.. ఈ వయసులో అలాంటి రిస్క్ అవసరమా బాసూ..!?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ ఉన్నా సరే అక్షయ్ కుమార్ అంటే అదో ప్రత్యేకమైన అభిమానం . ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడుతాడు అనే ఓ నమ్మకం . అంతేకాదు ఎటువంటి కండిషన్లోనైనా సరే సహాయం కోరి ఇంటికి వచ్చిన వారికి కాదు లేదు అనకుండా హెల్ప్ చేయడంలో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తర్వాత ఎవరైనా . అంతెందుకు ప్రపంచ దేశాలు కరోనాతో అల్లాడిపోతుంటే మన దేశానికి అందరికన్నా ఎక్కువగా ఆర్థిక సహాయం చేసి మనసున్న మహారాజు గా పేరు సంపాదించుకున్నాడు .

దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్ పేరు మారు మ్రోగిపోయింది . కాగా రీసెంట్గా ఆయన చేస్తున్న సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వస్తున్నాయి. అయినా సరే హిట్లు ఫ్లాప్ లు అని సంబంధం లేకుండా అక్షయ్ కుమార్ సినిమాలకు కమిట్ అవుతూనే ఉన్నాడు . తాజాగా కెరియర్ లో ఎప్పుడూ లేనివిధంగా కాంట్రవర్షియల్ సినిమాలకు సైన్ చేశాడు అక్షయ్ కుమార్ . ఆయన తాజాగా రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తుంది . అందులో ఒకటి మరాఠీ చిత్రం . వేద మరాఠీ .. ఈ సినిమా షూటింగ్ మంగళవారం ముంబైలో గ్రాండ్గా ప్రారంభమైంది.

అంతేకాదు దీంతో పాటు మరొక చిత్రంలో కూడా నటిస్తున్నాడు అక్షయ్ కుమార్ . అది సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అంటూ తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో అక్షయ్ కుమార్ చాలా బోల్డ్ గా నటించబోతున్నట్లు అలాగే మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ యువత ఎలా తప్పు దావపడుతుంది సెక్స్ విషయాలు అవగాహన లేక ఎంతో మంది కాపురాలు కూలిపోతున్నాయి అనే బేస్ మీద ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సెక్స్ టీచర్గా కనిపించబోతున్నాడట .

అంతేకాదు ఎంతో మంది విద్యార్థులకు అలాంటి విషయాల్లో అవగాహన లేని అబ్బాయిలకి.. అలాంటి మూమెంట్లు అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారో చెప్పే టీచర్గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇలాంటి పాత్రలు నటించడం పై ఆయన ఫాన్స్ మండిపడుతున్నాడు . సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేస్తానన్న నువ్వు ఇలాంటి సినిమాలలో నటించడం అస్సలు నచ్చడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే సినిమా స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రాబ్లమ్‌స్ ఎదుర్కొంటున్నారంటే సినిమా రిలీజ్ అయ్యే సరికి ఎన్ని గొడవలు వస్తాయో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!