మెప్పిస్తేనే మారుతి మూవీకి మోక్షం.. ప్ర‌భాస్ పెద్ద ట్విస్టే ఇచ్చాడుగా!?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ మూవీ నిర్మితం అవుతోంది. ఇందులో మాళ‌వికా మోహ‌న‌న్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. `రాజా డీలక్స్` అనే పేరుని ఈ సినిమాకి టైటిల్ గా ప‌రిశీలిస్తున్నారు.

ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీని ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్ర‌త్యేక సెట్ లో చ‌క‌చ‌కా షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వ‌గా.. ఇటీవ‌ల రెండో షెడ్యూల్ ను సైతం ప్రారంభించారు. తాజాగా సెట్స్ నుంచి ప్ర‌భాస్ ఫోటో కూడా లీక్ నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

అదేంటంటే ఈ సినిమా ప్రభాస్ ను మెప్పిస్తేనే విడుదలకు మోక్షం లభిస్తుందట. సినిమాకు సైన్ చేయడానికి ముందే ప్రభాస్ మారుతికి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడట. ఫైనల్ అవుట్ పుట్ తనకు నచ్చితేనే విడుదల ఉంటుందని లేదంటే లేదని ప్రభాస్ ముందే చెప్పాడట. అందుకు దర్శకనిర్మాతలు ఒప్పుకున్నాకే ప్రాజెక్ట్ కు సైన్ చేశాడ‌య‌. ఇక ఈ కారణంగానే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా చిత్రీక‌ర‌ణ జరుపుతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.