బాలయ్య వీరసింహారెడ్డి సాటిలైట్ రైట్స్ అన్ని కోట్ల..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు ఆహా షోలో హోస్ట్ గా సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. చివరిగా అఖండ వంటి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య మళ్లీ అంతటి విజయాన్ని అందుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నారు.

Official: NBK's Veera Simha Reddy Release Date

ఇక వీర సింహారెడ్డి చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్స్ వారు ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మల్లి నేని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ అన్ని కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారడమే కాకుండా ఈ సినిమాకి మంచి హైప్ ని తీసుకువచ్చాయి. ఈ సినిమా సాటిలైట్ హక్కులను అలాగే డిజిటల్ రైట్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రం విడుదలకాకుండానే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టెలివిజన్ దిగ్గజ సమస్త స్టార్ మా భారీ ధరకు కైవసం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని కైవసం చేసుకున్న స్టార్ మా ఇప్పుడు అదే బాటలో వీరసింహారెడ్డి చిత్రాన్ని కూడా దక్కించుకోవడం గమనార్హం. అఖండ సినిమా స్టార్ మా లో ప్రసారమైనప్పటికీ అద్భుతమైన రేటింగ్ ను సొంతం చేసుకుంది. అందుకోసం భారీగా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టుగా సమాచారం.ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా సొంతం చేసుకున్నట్లు సమాచారం. అతి త్వరలోనే అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తారేమో చూడాలి.

Share post:

Latest