బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు పొందిన కియారా అద్వానీ.. సిద్ధార్థ మలహోత్ర జంట కూడా ఒకటి. త్వరలోనే వీరిద్దరూ ఒకటి కాబోతున్నారని వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి బాగా వైరల్ గా మారుతున్నాయి. గత కొంతకాలంగా ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరుగుతున్న వైనం చూసి ప్రతి ఒక్కరూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల కియారా ఒక రహస్యాన్ని త్వరలో మీతో పంచుకోబోతున్నాను అంటూ హింట్ కూడా ఇచ్చింది. దీంతో వీరిద్దరికి నిశ్చితార్థానికి పెళ్లికి కలిపి ముహూర్తం పెట్టినట్లుగా వార్తలు వినిపించాయి.
ఆ తర్వాత వివాహ వేదికగా గోవాని నిర్ణయించుకున్నట్లుగా మీడియాలో పలు కథనాలు వినిపించాయి. అయితే కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీరి వివాహం జరగబోతుందని సమాచారం. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు బాలీవుడ్ లో కథనాలు వినిపించాయి. తాజాగా వివాహ వేదికను మార్చినట్లుగా తెలుస్తోంది. సిద్ధార్థ పంజాబీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ రకమైన ఏర్పాటు చేసేందుకు చండీగర్ అయితే అనుకూలంగా ఉంటుందని అక్కడ వేదికను మార్చినట్లుగా సమాచారం.
ఇక అందుకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను ఈ జంట రివిల్ చేయబోతున్నట్లు సమాచారం. సిద్ధార్థ, క్రియారా ఇద్దరూ కలిసి షేర్ షా సినిమాలో నటించారు ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా సమాచారం వినిపిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం కీయారా తెలుగులో రామ్ చరణ్ 15వ సినిమాలో కూడా నటిస్తోంది.