కాంతార సినిమా అనసూయని అంతలా విలీనం చేసిందా? ఏమందంటే?

తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. 2008లో భద్రుక కళాశాల నుండి MBA చేసిన ఆమె ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన తరువాత తనకి ఎంతో ఇష్టమైన కళారంగం వైపు అడుగులు వేసింది. మొదట ఆమె సాక్షి TVలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత జబర్దస్త్ షోలో యాంకరింగ్ అవకాశం రావడంతో అక్కడికి వెల్లిపిండి. ఆ తరువాత అన‌సూయ ఎలా దూసుకుపోయిందో చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలు అవకాశాలు రావడంతో ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక ఆమె ఇంట‌ర్ సెకండియ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడే NCC క్యాంప్‌ లో సుశాంక్ భ‌ర‌ద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌పోజ్ చేసాడట. అలా వారు తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో 2010లో ఒక్కటయ్యారట. ఇక సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్ అన్న సంగతి మీకు తెలుసు. ఇక అసలు విషయానికొస్తే, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెల్సినదే.

16 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి బాక్షాఫీస్ దగ్గర సత్తా చాటింది. కాగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో రిషబ్ నటనకు అందరు జేజేలు కొట్టారంటే మీరు నమ్మాలి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మంచి స్పందనతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాపై అనసూయ భరద్వాజ్ స్పందించి, రిషబ్ శెట్టి నటనపై ప్రశంశలు కురిపించారు. ఇందులో రిషబ్ శెట్టి నమ్మశక్యం కాని రీతిలో నటించారని తాను ఇంకా ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.

Share post:

Latest