టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. మూడు నెలల వ్యవధిలోని కన్న తల్లిని తండ్రిని కోల్పోయి తీవ్ర శోకాన్ని భరిస్తున్నాడు . మనకు తెలిసిందే సెప్టెంబర్ 28 మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు అనారోగ్య కారణంగా మృతి చెందారు ..సరిగ్గా ఆమె మరణించి 3 నెలలు కాకముందే ఆమె భర్త మహేష్ బాబు నాన్నగారు సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ గారు అనారోగ్య కారణంగా మరణించారు. ఈ క్రమంలోని సినీ ఇండస్ట్రీ తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
టాలీవుడ్ లెజెండ్ అయిన సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడం ఇండస్ట్రీలో ఇప్పటికీ జనాలు మర్చిపోలేకపోతున్నారు . కాగా ఇప్పటివరకు ఆ మరణ విషాద ఛాయల నుండి బయటకు రాని మహేష్ బాబు ఇప్పుడిప్పుడే కోల్కొని సినిమా షూట్ కి సిద్ధమవుతున్నారు. కాగా ఇప్పటివరకు ఏ కొడుకు ఏ తండ్రి కోసం చేయని పని చేయబోతున్నాడు మహేష్ బాబు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .నవంబర్ 15న కృష్ణ గారు మరణించిన విషయం తెలిసిందే.
ప్రతి ఏడాది ఈ రోజున దాదాపు లక్ష మంది పిల్లలకు మహేష్ బాబు అన్నదానం చేయాలని డిసైడ్ అయ్యారట . తన తండ్రికి పిల్లలు అంటే ఎంతో ఇష్టం అని వాళ్ళు ఆకలితో బాధపడుతుంటే అస్సలు చూడలేరని ..ఆయన ఆత్మకి శాంతి కలగాలంటే మహేష్ఇలాంటి పనులు చేయాలని డిసైడ్ అయ్యారట . అందుకే నవంబర్ 15 న కృష్ణ పేరు చెప్పి లక్ష మంది పిల్లలకు బట్టలు, భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట . ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోగా కూడా ఇలాంటి పనులకు పూనుకోలేదు . ఏది ఏమైనా సరే ఒకరికి హెల్ప్ చేయాలంటే మహేష్ బాబు తర్వాతే ఎవరైనా మన ఇండస్ట్రీలో అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఈ టాలీవుడ్ రియల్ హీరో.