పవన్..అలీ మధ్య గ్యాప్ పై క్లారిటీ ఇచ్చిన ఆలీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కచ్చితంగా ఆలీ ఉండాల్సిందే అనేంతగా డైరెక్టర్లు పట్టు పట్టేవారు. మొదట ఆలీ చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఎన్నో చిత్రాలలో ఎన్నో పాత్రలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఉంటుంది. అయితే కొన్ని కారణాల చేత పవన్ కళ్యాణ్, ఆలీ మధ్య విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. వాటి గురించి తాజాగా ఆలీ క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

కమెడియన్ ఆలీ వెండితెర పైన కాకుండా బుల్లితెరపై ఆలీతో సరదాగా అనే షోకి హోస్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 19వ తేదీన ప్రసారమయ్యేటువంటి ఈ ప్రోగ్రాం కి యాంకర్ సుమ గెస్ట్ గా రావడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ప్రోమో తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ షో రేటింగ్ విషయంలో కూడా బాగానే ఆకట్టుకుంటుంది.

యాంకర్ సుమ ఇందులో ఆలీ ని ఇలా అడుగుతూ పవన్ , ఆలీ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందని సుమ ఆలీని ప్రశ్నించగా.. అందుకు ఆలీ మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ కు గ్యాప్ వచ్చిందని విషయం అబద్ధము దీనిని బయట వ్యక్తులు ఎవరో సృష్టించారు. ఇటీవల జరిగిన తన కూతురు పెళ్లికి రావాలని పవన్ కళ్యాణ్ ను స్వయంగా కలిశానని..ఆయన కూడా తప్పకుండా వస్తాను అని చెప్పారు. కానీ కొన్ని కారణాల చేత సమయానికి ఫ్లైట్ దొరకగా రాలేకపోయానని తెలిపారని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ప్రోమో వైరల్ గా మారుతోంది.