టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా.. త్వరలోనే సెకండ్ షెడ్యూట్ను ప్రారంభించబోతున్నారు మేర్స్? అయితే ఈ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ టబు నటించబోతుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అయితే టబు పాత్రకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
మహేష్ బాబు పై మోజు పడే ఆంటీ రోల్ లో టబు కనిపించబోతుందట. మహేష్ బాబును పొందడం కోసం టబు పాత్ర ఎన్నో ప్రయత్నాలు చేస్తుందట. అతడిని టెంప్ట్ చేయడానికి సిగ్నల్స్ ఇస్తుందట. వినడానికి కాస్త చిరాగ్గా అనిపించిన త్రివిక్రమ్ టబు పాత్రను చాలా ఇంపుగా తీర్చిదిద్దబోతున్నాడని అంటున్నారు. మరి ఇదే నిజమైతే టబు పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది అనడంలో సందేహమే ఉండదు.