46ఏళ్ల వయసులో కూడా తగ్గని మీనా… రెమ్యునరేషన్ తెలిస్తే అవాక్కవుతారు?

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి మీనా గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఇప్పుడు పరిమితంగా సినిమాలలో నటిస్తూ కనిపిస్తున్నారు. భర్త మరణం తరువాత మీనా మానసికంగా కుంగిపోయింది. అయినా ఆ బాధను దిగమింగుకొని పిల్లలకోసం ఇపుడు సినిమాలలో నటిస్తోంది. దృశ్యం2 సినిమాకు సీక్వెల్ గా దృశ్యం3 తెలుగులో తెరకెక్కుతుండగా మరలా మనం వెంకీ – మీనా కాంబినేషన్ ను త్వరలో తెరపైన చూడబోతున్నాం. మరోవైపు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లకు కూడా మీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే మీనా రెమ్యునరేషన్ టాక్ అఫ్ ది టౌన్ అవుతోంది. అవును, మీనా తన పారితోషికాన్ని భారీగా పెంచేశారని సమాచారం. ఆఫర్లు అంతకంతకూ పెరుగుతుండటం వలన ఆమెకూడా దాన్ని క్యాష్ చేసుకోవాలని యోచిస్తోందని టాక్. ఈ విషయమే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రోజురోజుకు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో మీనా తన పారితోషికాన్ని పెంచడంలో ఆశ్చర్యం ఏముంది అని ఆమె అభిమానులు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు ఒక్కో సినిమాకు ఆమె 20 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తోందని టాక్. కూతురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీనా పారితోషికం విషయంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. మీనా రెమ్యునరేషన్ ను పెంచినా దర్శకనిర్మాతలు మాత్రం ఆమెకే సపోర్ట్ చేస్తున్నారని భోగట్టా. సాఫ్ట్ రోల్స్ లో మీనా స్థాయిలో మెప్పించడం చాలామంది నటీమణులకు ఇపుడు సాధ్యం కాదని, అందుకే ఆమె డిమాండ్లక్లు నిర్మాతలు ఒప్పుకుంటున్నారని తెలుస్తోంది.