`పుష్ప 2` క్లైమాక్స్ లో ఆ స్టార్ హీరో.. సుక్కూ ప్లాప్‌తో ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయం!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్‌` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు.

గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబ‌ట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప ది రూల్ టైటిల్ తో పార్ట్ 2 రాబోతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేమిటంటే.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ స్టార్ హీరో గెస్ట్ రోల్ లో చూపించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుకుమార్ ఇప్పటికే చరణ్ ను సంప్రదించగా.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. మరి నిజంగానే సుక్కూ ప్లాన్ నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయమని అంటున్నారు.

Share post:

Latest