యాంటీ కమ్మ ఫార్ములా..పర్చూరులో వైసీపీ రివర్స్..!

రాష్ట్రంలో టీడీపీ కంచుకోటలని వైసీపీ గట్టిగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే కొన్ని కోటలని కూల్చింది..ఈ సారి ఎన్నికల్లో మరికొన్ని కోటలని కూల్చాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ స్ట్రాంగ్‌గా ఉన్న పర్చూరు స్థానాన్ని టార్గెట్ చేశారు. ఇక్కడ టి‌డి‌పి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే..ప్రజల్లోనే ఉంటూ, తన ఇమేజ్‌ని పెంచుకుంటూ వెళుతున్నారు. పార్టీ బలంతో పాటు ఇక్కడ తన సొంత బలం కూడా ఉండటం వల్ల..పర్చూరులో ఏలూరికి తిరుగులేదనే పరిస్తితి ఉంది.

అలా ఉన్న ఏలూరికి చెక్ పెట్టాలని జగన్ చూస్తున్నారు. అందుకే ఇక్కడ వైసీపీలో మార్పులు చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సీటుని కాపు వర్గానికి ఇవ్వాలని కూడా ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. అంటే యాంటీ కమ్మ ఫర్ముల ఉపయోగించి..కమ్మ నేత అయిన ఏలూరికి చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. అంటే కాపు నేతకు సీటు ఇస్తే..ఇక్కడ కాపు ఓట్లు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. అందుకే ఈ సీటులో ఆమంచి కృష్ణమోహన్‌ని బరిలో దింపాలని చూశారు.

కానీ ఆమంచి మాత్రం చీరాల వదిలి రావడానికి ఇష్టపడటం లేదు..ఆయన చీరాల సీటు కోసమే చూస్తున్నారు. దీంతో వేరే కాపు నేతని పెడదామని చూస్తున్నారు. కాకపోతే యాంటీ కమ్మ ఫార్ములా వైసీపీకి రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏలూరికి కాపు ఓట్లే ప్లస్. దాదాపు 22 వేల ఓట్లు ఉంటే అందులో 15 వేలు పైనే ఏలూరికి పడతాయి. ఒకవేళ కాపు నేతని వైసీపీ దింపితే…ఒక 2, 3 వేలు పోతాయి.

అదే సమయంలో వైసీపీకి మద్ధతు ఇచ్చే కమ్మ ఓట్లు పోతాయి. ఈ పరిస్తితి వైసీపీ అధిష్టానానికి బాగా అర్ధమైంది. అందుకే ఇప్పుడు ఇంచార్జ్‌గా ఉన్న కమ్మ నేత రావి రామనాథంబాబుకే పర్చూరు సీటు ఫిక్స్ చేయడానికి వైసీపీ చూస్తుంది. ఇప్పటికే ఆయన గడప గడపకు తిరగడంలో టాప్‌లో ఉన్నారు. అయితే రావికి సీటు ఇచ్చినా సరే ఏలూరిని నిలువరించడం కష్టమే.

Share post:

Latest