గుంటూరు వైసీపీలో ట్విస్ట్..సుచరిత ప్లేస్‌లో డొక్కా.?

గుంటూరు వైసీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి..ఇప్పటికే రాజధాని అమరావతి అంశం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం లాంటి కారణాల వల్ల…ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. పైగా ఇక్కడ టీడీపీ వేగంగా పుంజుకుంటుంది…అటు జనసేనతో పొత్తు టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే జిల్లాలో వైసీపీలో అంతర్గత విభేదాలు కూడా ఎక్కువ నడుస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాల పదవికి మేకతోటి సుచరిత రాజీనామా చేశారు. ఇప్పటికే ఆమెని క్యాబినెట్ నుంచి తొలగించారు. ఆ తర్వాత గుంటూరు అధ్యక్షురాలుగా పెట్టారు. అయినా సరే పార్టీ లైన్ అవ్వలేదు..పైగా ఎక్కడకక్కడ సమస్యలు ఉన్నాయి. దీంతో సుచరిత స్వయంగా పదవి నుంచి తప్పుకున్నారు. అయితే సీఎం జగన్ పార్టీలో మార్పులు చేయడానికి రెడీ అవుతున్నారు. పలు జిల్లాల్లో అధ్యక్షులని మార్చే యోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే సుచరిత రాజీనామా చేశారని తెలుస్తోంది..ఏదేమైనా గాని సుచరిత రాజీనామాతో గుంటూరులో వైసీపీ పరిస్తితి సరిగ్గా లేదని అర్ధమవుతుంది. ఇక సుచరిత ప్లేస్‌లో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని గుంటూరు అధ్యక్షుడుగా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన డొక్కాకు ఎమ్మెల్సీ ఇచ్చారు..అలాగే తాడికొండ సమన్వయకర్తగా నియమించారు.

దీంతో తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇదే సమయంలో డొక్కాని గుంటూరు అధ్యక్షుడుగా పెడతారని కథనాలు వస్తున్నాయి. అయితే డొక్కాని పెడితే..పార్టీలో కొన్ని అసంతృప్తి వర్గాలు భగ్గుమనే ఛాన్స్ కూడా ఉంది. డొక్కా కాకుండా వేరే ఆప్షన్‌గా రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. మరి ఆయనకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తారో లేదో క్లారిటీ లేదు. మొత్తానికి సుచరిత మాత్రం పదవి నుంచి తప్పుకున్నారు. మరి జగన్..ఎవరిని గుంటూరు అధ్యక్షుడుగా పెడతారో చూడాలి. అలాగే గుంటూరులో వైసీపీ పికప్ అవుతుందో లేదో కూడా చూడాలి.

Share post:

Latest