బాలీవుడ్‌లో మరో అరుదైన రికార్డును.. బ్రేక్ చేసిన కాంతార..!

కన్నడ హీరో దర్శకుడు రిషిబ్ శెట్టి స్వీయ దర్శికత్వంలో తెర‌కెక్కి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా కాంతార. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో ఎవరు ఊహించిని విధంగా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో కూడా అరుదైన రికార్డు నమోదు చేసింది. సౌత్ నుంచి బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఏడో సినిమాగా రికార్డులకు ఎక్కింది.

Kantara Box Office Day 2: Rishab Shetty

బాలీవుడ్ లో ఇప్పటిదాకా రు. 50 కోట్ల వరకు కలెక్షన్లు సాధించిందని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సినిమా తొలి రెండు వారాల కంటే మూడో వారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిందని ఆయన వెల్లడించాడు. ఈ సంవత్సరం సౌత్ నుంచి విడుదలైన సినిమాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో రెండో సినిమాగా కాంతార నిలిచింది.

Kantara Box Office Collection Day 7: Now Eying 50 Cr, domestically - JanBharat Times

ఈ సంవత్సరం టాలీవుడ్ నుంచి నిఖిల్ హీరోగా కార్తికేయ2 సినిమా విడుదలై బాలీవుడ్లో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్లను కాంతార అధిగమించింది. ఇప్పటివరకు సౌత్ నుంచి బాలీవుడ్ లో విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో బాహుబలి 2 మొదటి ప్లేస్ లో ఉంది.

Kantara Box Office Collection Day 6: Witnesses a huge jump on Dussehra - JanBharat Times

కే జి ఎఫ్2 – త్రిబుల్ ఆర్ సినిమాలు రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఆ తర్వాత బాహుబలి, పుష్పాది రైజ్‌ ఉన్నాయి. ఇప్పటి వరకు కాంతార పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో కలిపి 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. ఇప్పటికీ కూడా భారీ కలెక్షన్లతో కాంతార బాలీవుడ్ లో దూసుకుపోతుంది.