సాధారణంగా సినీ సెలబ్రిటీల వివాహాలు, నిశ్చితార్థ వేడుకలు సోషల్ మీడియాలో మంచి క్రేజజ్ ఉంటుందని చెప్పవచ్చు. ఏ సెలబ్రిటీ అయినా సరే వివాహం జరిగిన ఎంగేజ్మెంట్ జరిగిన తమ ఇంటి వేడుకలలా అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది నటీనటుల సైతం చెప్పకుండానే సైలెంట్ గా అన్ని పనులను కానీ చేస్తూ ఉన్నారు. అలా నటి త్రిష కూడా ఇప్పుడు తాజాగా ఎవరికి చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంది .అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
వివాహం అంగరంగ వైభవంగా జరిగినట్లుగా తెలుస్తోంది. బుల్లితెరపై చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన నటి త్రిష ఇప్పుడు మనసిచ్చి చూడు అనే సీరియల్స్ లో నటిస్తున్నది. ఇందులో ఈమె కీర్తికి చెల్లెలు పాత్రలో రేణు పాత్రలో నటించి మెప్పించింది. తర్వాత ఈ ముద్దుగుమ్మ మరే సీరియల్ లో కూడా నటించలేదు. అయితే అందుకు కారణం పెళ్లి కుదిరిందని అందుచేతనే సీరియల్స్ కూడా మారేసిందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు అన్నిటినీ నిజం చేసే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఎంగేజ్మెంట్ ఫోటోలు చూస్తే మనకి అర్థమవుతుంది.
ఇక త్రిష అభిమానుల సైతం ఎవరికి చెప్పకుండా ఇలాంటి పనిచేయడంతో కాస్త నిరుత్సాహ పడుతున్నారు. అయినప్పటికీ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.ఇక ఈ ఎంగేజ్మెంట్ కి మనసిచ్చి చూడు సీరియల్ మెంబర్స్ అందరూ హాజరైనట్లుగా సమాచారం. ఇక త్రిష పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు విశాల్ ప్రస్తుతం వీరిని సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.